AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అనాథలతో పవన్ సతీమణి సంబురాలు.. కేక్​ కట్​చేసి న్యూ ఇయర్​ వేడుకలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్​ సతీమణి అనా కొణిదెల అనాథలతో కలిసి న్యూ ఇయర్​ సంబురాలు చేసుకున్నారు. పవన్​ పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉండగా.. అనా మాత్రం తనకు ఇష్టమైన సోషల్​ యాక్టివిటీస్​లో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే ఆయన చేసే ఆర్థిక సహాయాలు, మంచి మనసు అభిమానులకు గుర్తుకు వస్తుంది. ఎవరు ఏ ఆర్థిక సాయం కోరినా పవన్ కాదనకుండా చేస్తారని ప్రచారం. ఇప్పుడు పార్టీ ద్వారా పవన్ కొన్ని మంచి పనులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఇటీవల క్రిస్టమస్ వేడుకల్ని అనాథ శరణాలయంలో చిన్న పిల్లలతో జరుపుకున్నారు. ఆ సమయంలో ఆమె అనాథ శరణాలయానికి కొన్ని నిత్యావసర వస్తువులు కూడా విరాళంగా అందించారు.

ANN TOP 10