హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సరం 2024 వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ సంబరాలు జరిగాయి. డీజే సౌండ్స్ కు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 100కుపైగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో కలర్ ఫుల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. మరోవైపు, వైన్స్, బార్లు, ఫుల్ రష్ కొనసాగింది. బార్ అండ్ రెస్టారెంట్స్ రద్దీగా మారిపోయాయి.
హైదరాబాద్ మహా నగరంలో ఎటు చూసినా న్యూఇయర్ సంబరాలు కనిపించాయి. రోహిత్ శర్మ పేరు మీద చెరిగిపోని రికార్డ్ ఇది ఇలావుంటే, పోలీసులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు ఫ్లైఓవర్లపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక తాగి వాహనాలు నడిపితే రూ. 10వేలతోపాటు ఆరు నెలల జైలు శిక్ష వేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతేగాక, రాత్రి ఒంటిగంట తర్వాత ఏ ఈవెంట్స్ నిర్వహించొద్దని పోలీసులు స్పష్టం చేశారు.
రోవైపు, న్యూఇయర్ వేడుకల సందర్భంగా డ్రగ్స్ వినియోగంపైనా నిఘా పెట్టారు పోలీసులు. ఎక్సైజ్ పోలీసులు నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహనదారులను తనిఖీ చేశారు. జూబ్లీహిల్స్ లోని పలు పబ్‌లలో డ్రగ్స్ ఉన్నాయనే అనుమానంతో ఎక్సైజ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పలు చోట్ల మత్తు పదార్థాలను సీజ్ చేసిన పోలీసులు.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేని పబ్ లలో రాత్రి 10 గంటలకే సౌండ్ సిస్టమ్ ఆఫ్ చేయాలని ఆదేశించారు. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ న్యూఇయర్ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి వంటి ప్రధాన నగరాల్లో న్యూఇయర్ వేడుకలు జరిగాయి. డీజేలు పెట్టి డ్యాన్సులు చేశారు. పలు చోట్ల సమూహిక కార్యక్రమాలు జరిగాయి. విశాఖ బీచ్‌లోనూ కొత్త ఏడాది వేడుకలకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చి ఎంజాయ్ చేశారు.









