AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆరేళ్ళ బాలుడిపై 5 వీధికుక్కల దాడి.. గుంటూరులో దారుణ ఘటన!!

తెలుగు రాష్ట్రాల్లో కుక్కల గోల భయంకరంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా వీదికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. తాజాగా మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ళ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్!! గుంటూరు నగర మేయర్ ఇంటికి కూతవేటు దూరంలోనే ఆరేళ్ళ బాలుడు కార్తికేయపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలు కాగా, బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయాన్నే కరాటే తరగతులకు వెళ్లి వస్తున్న బాలుడు కార్తికేయపై ఐదు కుక్కలు దాడి చేశాయి. ఈ క్రమంలో అటు వెళ్తున్న వాహనదారుడు సకాలంలో స్పందించి బాలుడిని కుక్కల బారి నుండి కాపాడాడు. సెలవులు కావటంతో కార్తికేయ చుట్టాలింటికి వచ్చాడు.

అక్కడ కరాటే తరగతులకు కార్తికేయ హాజరవుతున్నాడు. బాలుడి తల్లిదండ్రులు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు.ప్రస్తుతం బాలుడిపై కుక్కలు దాడి చేయటంతో తల్లిదండ్రులు హుటాహుటిన గుంటూరుకు బయలుదేరారు, తమ కొడుకు పరిస్థితిపై వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇక ఆరేళ్ళ బాలుడిపై వీదికుక్కలు దాడి చేసిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడద నుండి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ANN TOP 10