AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. అమీర్‌పేటలో గోల్డ్‌ ఏటీఎం ప్రారంభం

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. ఇక నుంచి బంగారం కోసం జ్యువలరీ షాపులకు పోవాల్సిన అవసరం లేకుండా ఏటీఎంలోనే గోల్డ్ తీసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గోల్డ్‌ సిక్కా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో హైదారాబాద్‌లోని అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ ప్రాంగణంలో గోల్డ్‌ ఏటీఎంను నిర్వాహకులు ప్రారంభించారు. ఈ ఏటీఎంలో 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు బంగారాన్ని కాయిన్స్ రూపంలో తీసుకోవచ్చు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు లేదా యూపీఐ పేమెంట్‌ ద్వారా బంగారు, వెండి కాయిన్లను ఈ గోల్డ్ ఏటీఎంలో తీసుకునే విధంగా ఈ ఏటీఎంను డిజైన్ చేశారు. బ్యాంకులు ఏర్పాటు చేసిన ఏటీఎంలో డబ్బులు తీసుకున్న విధంగానే గోల్డ్‌ సిక్కా ఏటీఎంలో బంగారు, వెండి కాయిన్లు తీసుకునేలా దీన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

ఏటీఎంలో నిర్దేశించిన విధంగా లావాదేవీ పూర్తయిన వెంటనే మనం ఎంచుకున్న బంగారం కాయిన్లు బయటికి వస్తాయి. 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు బంగారం లేదా వెండి కాయిన్లను ఎంపిక చేసుకుని నిర్దేశించిన మొత్తాన్ని డెబిట్‌, క్రెడిట్‌ లేదా యూపీఐ పేమెంట్స్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ప్రారంభించిన రోజే వినియోగదారుల నుంచి ఆశించిన దానికంటే ఎక్కువగానే స్పందన వచ్చిందని గోల్డ్‌ సిక్కా లిమిటెడ్‌ యాజమాన్యం తెలిపింది.

ANN TOP 10