రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్ లాల్ కుటుంబాన్ని మోసం చేసిన కేసులో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ అరెస్టయ్యాడు. అతనిని సీసీఎస్ పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్లను సృష్టించి భన్వర్ లాల్ ఇల్లును కాజేసే ప్రయత్నం చేశాడు. దీంతో సీసీఎస్ పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నవీన్ కుమార్ను అరెస్ట్ చేశారు. భన్వర్ లాల్ ఇంట్లో అద్దెకు ఉంటోన్న నవీన్ కుమార్ ప్రస్తుతం పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్నారు.