AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్- మోదీ భేటీలో జరిగింది ఇదే: వెల్లడించిన భట్టి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. దేశ రాజధానిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ప్రధానితో మర్యాదపూరకంగా సమావేశం అయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క.. మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కొన్ని కీలక అంశాలు, ప్రతిపాదనలను మోదీకి అందజేశారు. వాటన్నింటిపైనా ఆయన సానుకూలంగా స్పందించారు. హామీలను నెరవేర్చే దిశగా త్వరితగతిన చర్యలు తీసుకుంటానని అన్నారు.

మోదీతో సమావేశం ముగిసిన అనంతరం భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశం వివరాలను వెల్లడించారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలను అమలు చేసే విషయాన్ని ప్రధాని వద్ద ప్రస్తావించామని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేట్ స్టీల్ కోచ్ ఫ్యాక్టరీ.. వంటి డిమాండ్లను ఆయన ముందు ఉంచామని అన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చేలా తక్షణ చర్యలను చేపట్టాలని కోరినట్లు చెప్పారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టును వెంటనే రాష్ట్రానికి మంజూరు చేయాల్సిన అవసరం గురించి మోదీకి వివరించినట్లు తెలిపారు. అలాగే.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని మోదీని కోరినట్లు భట్టి విక్రమార్క వివరించారు. హైదరాబాద్‌కు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, సైనిక్‌ స్కూల్‌ను కేటాయించాలని కోరామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

ANN TOP 10