AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో తొలి కోవిడ్‌ మరణాలు

– ఉస్మానియా ఆస్పత్రిలో ఇద్దరు మృతి
– కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ
అనారోగ్యంతో ఉస్మానియా ఆస్పత్రిలో చేరిన ఇద్దరు వ్యక్తులు సమస్య తీవ్రతరం కావడంతో మృతి చెందారు. తెలంగాణలో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో ఇరవై నాలుగు గంటల్లో 412 కరోనా కేసులు నమోదు కాగా… ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,170 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అయితే తెలంగాణలో తాజాగా తొలి కొవిడ్‌ మరణాలు సంభవించాయి. అనారోగ్యం కారణంగా ఇద్దరు వ్యక్తులు ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. సమస్య తీవ్రతరం కావడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతి చెందినవారిలో ఒకరికి అరవై ఏళ్లు, మరొకరికి నలభై ఏళ్లు ఉన్నాయి. వీరికి పరీక్షలు నిర్వహించగా కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్మింది. ఇక్కడే ఇద్దరు జూనియర్‌ డాక్టర్లకు కూడా పాజిటివ్‌ అని తేలింది.

ANN TOP 10