దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. ఇటీవల జేఎన్1 వేరియంట్ వెలుగు చూసిన నేపథ్యంలో… రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాయి. తాజాగా, తెలంగాణలో 1,322 శాంపిళ్లను పరీక్షించగా… 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 30 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. తాజా పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,44,540కి పెరిగింది. ఇవాళ ఒకరు కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రోగుల రికవరీ రేటు 99.51 శాతంగా ఉంది.
