1,322 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పన్నెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో మూడింట రెండొంతులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. హైదరాబాద్‌లో తొమ్మిది, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్లు బులెటిన్ తెలిపింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనా నుంచి ఒకరు కోలుకోగా… 38 మంది చికిత్స తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరో ముప్పై మందికి సంబంధించిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని వెల్లడించింది.