AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రబాబుతో ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ..! ఐపాక్‌ సంచలన ప్రకటన..!

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కలవడం శనివారం మీడియాలో ప్రముఖంగా దర్శనమిచ్చింది. ప్రశాంత్ కిశోర్ ఓ నివేదికను చంద్రబాబుకు సమర్పించారంటూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ప్రశాంత్ కిశోర్ స్పందించారు. ఇవాళ తాను చంద్రబాబునాయుడిని కలవడం వెనుక ప్రత్యేక కారణం అంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు సీనియర్
I PAC | ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త శనివారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కావడంతో ఆంధ్రప్రదేశ్‌ సర్వత్రా చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి గెలుపు కోసం ప్రశాంత్‌ కిశోర్‌ నేతృత్వంలోని ఐపాక్‌ పని చేసింది. ఆ తర్వాత జగన్‌, కిశోర్‌ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఏపీ వ్యవహారాలపై పీకే దృష్టి సారించలేదు. మరో వైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయ వాతావరణం వేడెక్కింది.

అయితే, ప్రశాంత్‌ కిశోర్‌పై అధికార వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందరు పీకేలు వచ్చిన చేసేది ఏం లేదంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఐపాక్‌ కీలక ప్రకటన చేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ గెలుపుకోసం పని చేస్తామని ట్విట్టర్‌ (ఎక్స్‌) పోస్ట్‌ పెట్టింది. ఏపీ ప్రజల అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్న సీఎం జగన్‌కు మా వంతు తోడ్పాటు అందిస్తామని పేర్కొంది. ఏపీలో వైఎస్సార్‌సీపీతో కలిసి పని చేస్తున్నామని, 2024 ఎన్నికల్లో​ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గెలుపుకోసమే తాము పని చేస్తాం అని స్పష్టం చేసింది.

ANN TOP 10