బీఆర్ఎస్ స్వేదపత్రం రేపటికి వాయిదా పడింది. ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ స్వేదపత్రంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేయనున్నారు.
శనివారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ స్వేదపత్రాన్ని విడుదల చేస్తామని, అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని నిన్న కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వేద పత్రం కోసం టీఆర్ఎస్ శ్రేణులు, రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు.