AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పార్టీ ఆదేశిస్తే రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తా.. ఈటల రాజేందర్

పార్టీ ఆదేశిస్తే రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తానని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చెప్పారు. హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తామమన్నారు. పోటీ చేయాలా వద్దా, ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది బీజేపీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు. 2021 ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత హుజూరాబాద్‌ నియోజకవర్గంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పగబట్టారని ఈటల ఆరోపించారు. కేసీఆర్​ఎమ్మెల్యే హక్కులను హరించారని ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. గెలిచిన ఎమ్మెల్యే బాధ్యతలను నిర్వర్తించకుండా అడ్డుకున్నారన్నారు. జిల్లా నుంచి నియోజకవర్గ స్థాయి అధికారులకు ఆంక్షలు విధించారని ఆరోపించారు.

నాడు కల్యాణలక్ష్మి చెక్కులపై సంతకాలు చేసేది తానైతే.. పంపిణీ చేసేది బీఆర్​ఎస్​వాళ్లని చెప్పుకొచ్చారు. ఎక్కడ అధికారికమైన కార్యక్రమాలను నిర్వహించలేకపోయామని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అప్పటి ప్రభుత్వం పగబట్టిందన్నారు. ప్రజాస్వామ్య వ్వవస్థలో ఇంతటి చీకటి పరిపాలన చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఈటల రాజేందర్ విమర్శించారు.

ANN TOP 10