ఆ మాటతో మెగా లోకంలో సంబరాలు..
ఆస్కార్ వేడుకలో రామ్ చరణ్, ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. అయితే బ్లాక్ సూట్ లో సతీమణి ఉపాసనతో కలిసి ఆస్కార్ వేడుకకు వచ్చిన రామ్ చరణ్.. అక్కడి మీడియాతో మాట్లాడుతూ పుట్టబోయే బిడ్డపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
RRR ఫ్యామిలిలో భాగంగా నేను కూడా ఆస్కార్ వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉందని ఉపాసన చెప్పింది. ఆ వెంటనే రామ్ చరణ్ రియాక్ట్ అవుతూ.. ప్రస్తుతం ఉపాసన 6 నెలల గర్భవతి అని చెప్పారు. పుట్టబోయే బిడ్డకు ఇప్పుడే చాలా ప్రేమ లభిస్తోంది. కడుపులో ఉండగానే ఆ బిడ్డ మాకు అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు రామ్ చరణ్.
ఆస్కార్ వేడుకల కోసం అందరికనే ముందే అమెరికా చేరుకున్నారు రామ్ చరణ్. ఆయన వెంట ఉపాసన కూడా వెళ్ళింది. అమెరికాలో వాళ్లిదరికి సంబంధించిన చాలా ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. అనుకున్నట్లుగానే నాటు నాటుకు ఆస్కార్ రావడంతో మెగా శిబిరాల్లో సంబరాలు నెలకొన్నాయి.