AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మాజీ మంత్రి మల్లారెడ్డిపై చీటింగ్‌ కేసు

– గిరిజనుల భూములు కబ్జా చేశారంటూ ఫిర్యాదు
– శామీర్‌పేట్‌ పీఎస్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి మల్లారెడ్డిపై చీటింగ్‌ కేసు నమోదు అయ్యింది. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో శామీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్‌∙చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తహసీల్దార్‌తో పాటు మల్లారెడ్డిపై ఫిర్యాదు రావడంతో నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు తొమ్మిది మందిపై 420 చీటింగ్‌ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ నమోదు అయ్యింది.

శామీర్‌పేట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ మల్కాజిరి జిల్లా చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని సర్వే నంబర్‌ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల ఎస్టీ (లంబాడీల) వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారని శామీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. విచారణ చేపట్టిన పోలీసులు మాజీ మంత్రి, అతని అనుచరులు తొమ్మిది మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ 420 చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ANN TOP 10