AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ శాసనసభ నూతన స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్

తెలంగాణ శాసనసభ నూతన స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ వ్యవహరించనున్నారు. ఆయన పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. 2012లో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లో ప్రసాద్‌కుమార్ టెక్స్‌టైల్ మంత్రిగా పనిచేశారు. రేవంత్‌రెడ్డికి ప్రధాన అనుచరుడైన ఆయనకు ఇప్పుడు స్పీకర్ పదవి లభించింది. ఎస్సీ కోటాలో గెలుపొందిన దామోదర రాజనర్సింహకు మంత్రి పదవి దక్కడంతో ప్రసాద్‌కు అధిష్ఠానం స్పీకర్ పదవి అప్పగించింది. దీంతో దళిత సామాజిక వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ANN TOP 10