హైదరాబాద్: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దైవసాక్షిగా రేవంత్ ప్రమాణస్వీకారం చేశారు. సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారం అనంతరం భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేదికపై నిలిచారు.









