తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఇవాళ మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణం చేసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు ఫైల్‌పై తొలి సంతకం చేశారు. రెండో సంతకం రజినీ అనే దివ్యాంగురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్న ఫైల్ పై సంతకం చేశారు.
తెలంగాణ తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఎనముల రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం జరిగింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ ప్రమాణానికి ముహూర్తం నిర్ణయించారు. అయితే, అనుకున్న సమయానికంటే కొద్ది నిమిషాలు ఆలస్యమైంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. అలాగే, ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఆత్మీయ అతిథులుగా తెలంగాణ ఉద్యమకారులు వచ్చారు.
⍟ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల అమలుపై తొలి సంతకం చేశారు. దివ్యాంగురాలు రజినికి ఉద్యోగం కల్పిస్తూ రెండో ఫైలుపై సంతకం చేశారు. అనంతరం నూతన ముఖ్యమంత్రికి వివిధ దేవాలయాల నుంచి వచ్చిన వేద పండితులు ఆశీర్వాదం అందజేశారు.









