AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్ కు చేరుకున్న సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ..

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు(గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. అగ్రనేతల రాక సందర్భంగా రేవంత్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో సోనియా, రాహుల్, ప్రియాంక‌లకు రేవంత్, తెలంగాణ ఇన్‌చార్జ్ ఠాక్రే, శ్రీధర్‌ బాబు ఘన స్వాగతం పలికారు.

భారీ భద్రత నడుమ కాన్వాయ్‌లో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాజ్‌కృష్ణ హోటల్‌కు ఏఐసీసీ నేతలు బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేతల రాక సందర్భంగా ఎయిర్ పోర్ట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీస్టేడియంలో జరుగనున్న ఈ కార్యక్రమంలో రేవంత్‌తో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ANN TOP 10