AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్‌

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2023 ఏడాదికి గాను ఫోర్బ్స్‌ విడుదల చేసిన జాబితాలో నిర్మలా సీతారామన్‌ 32వ స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలా సీతారామన్‌కు వరుసగా 5సార్లు చోటు దక్కించుకోవడం విశేషం. గతేడాది 36వ స్థానంలో నిలిచిన నిర్మలా, ఇప్పుడు 32వ స్థానంలో ఉన్నారు.

ఇదిలా ఉంటే నిర్మలా సీతారామన్‌తో సహా భారత్‌కు చెందిన మొత్తం నలుగురు మహిళలకు చోటు దక్కింది. వీరిలో నిర్మలా సీతారామన్‌ తొలి స్థానంలో నిలిచారు. నిర్మలా సీతారామన్‌ తర్వాత భారత్‌ నుంచి హెచ్‌సీఎల్ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్‌ మల్హోత్రా, 60వ స్థానంలో, స్టీల్ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఛైర్‌పర్సన్ సోమా మోండల్‌ 70వ స్థానంలో, బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజూందర్‌ షా 76వ స్థానంలో ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ఇదిలా ఉంటే.. నిర్మలా సీతారామన్‌ రాజకీయాల్లోకి రాకముందు బ్రిటన్‌ అగ్రికల్చర్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌, బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌లలో కీలక పదవులు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న నిర్మలా.. జాతీయ మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా ఉన్నారు.

ANN TOP 10