తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం మేజిక్ ఫిగర్ 60 అటూ.. ఇటూగా ఆ పార్టీ లీడింగ్‌లో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో బీజేపీ హేమాహేమీలైన బీజేపీ ముఖ్య నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్, రఘునంద్ రావు వెనుకంజలో ఉన్నారు. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌పై బీఆర్ఎస్ అభ్యర్ధి 1061 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే కరీంనగర్‌లో బండి సంజయ్‌పై బీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు దుబ్బాకలో రఘునంద్ రావుపై కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.









