AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఈసీని కలిసిన రేవంత్ రెడ్డి టీమ్.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కంప్లైంట్

తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి (CEC) కంప్లైంట్ ఇచ్చింది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీమ్. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను కలిసిన రేవంత్ రెడ్డి బృందం.. కొన్ని అంశాలపై కంప్లైంట్ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరింది.

డిసెంబర్ 4న బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించాలనుకున్న కేబినెట్ సమావేశంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. ఈ సమావేశం జరగకుండా చెయ్యాలని కోరుతోంది. ఈ సమావేశం ద్వారా రైతు బంధు నిధులు రూ.6వేల కోట్లను.. బీఆర్ఎస్ నేతలకు చెందిన కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కంప్లైంట్‌లో తెలిపారు. అలాగే.. “సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రెండు మూడు రోజులుగా అసైన్డ్ లాండ్స్ రికార్డులను ధరణి పోర్టల్‌లో మార్చుతున్నారన్న ఉత్తమ్ కుమార్.. ప్రభుత్వం దిగిపోయేలేపు.. అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్ చేసే కుట్ర జరుగుతోందని కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎలాంటి ఆర్థిక లావాదేవీలూ, డీల్సూ చెయ్యకుండా చూడాలని కోరినట్లు తెలిపారు.

ANN TOP 10