ప్రజలకు అందుబాటులో ఉండని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇంటికి పంపడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వేంకటరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రేకొండలోవిలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదన్నారు. కేసీఅర్ విధానంపై రాష్ట్ర ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని జాతీయ పార్టీ నిర్ణయాలతో ముందుకు పోతున్నామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం తథ్యమన్నారు. ఈసమావేశంలో సింగిల్‌విండో డైరెక్టరు చాడ శ్రీధర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి నాగల్లి లక్ష్మరెడ్డి, మండల కొమురయ్య పాల్గొన్నారు









