సీఎం కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో కేసీఆర్ దంపతులు సిద్దిపేట జిల్లా స్వగ్రామం చింతమడకకు చేరుకున్నారు. చింతమడక పోలింగ్ కేంద్రంలో కేసీఆర్ దంపతులు ఓటు వేశారు.
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతున్నది. ఈరోజు(గురువారం, నవంబర్ 30) ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర 5 గంటల వరకు కొనసాగనుంది. ఈక్రమంలో పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.









