AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాయ్‌ రాజా కాయ్‌.. తెలంగాణలో జోరుగా బెట్టింగులు..!

ఇప్పటి వరకు క్రికెట్‌, ఇతరత్రా పోటీలపై బెట్టింగులు నిర్వహించిన ఆన్​లైన్ వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌లు.. ఇప్పుడు ఎన్నికల ఫలితాలపై వాటి కన్ను పడింది. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బరిలోకి దిగిన పందెం రాయుళ్లు… కాయ్ రాజా కాయ్ అంటూ జోరుగా బెట్టింగ్స్ కాస్తున్నారు. ఈ సారి పలానా పార్టీ అధికారంలోకి రాబోతోందని, పలానా నియోజకవర్గంలో పలానా అభ్యర్థి గెలవబోతున్నారంటూ భారీగా పందాలు వేస్తున్నారు. వందకు వెయ్యి, వెయ్యికి లక్ష అంటూ బెట్టింగ్ బంగార్రాజులు పందెలాలు కాస్తున్నారు. ఇక పెద్ద లీడర్లు తలపడుతున్న నియోజకవర్గాల్లో అయితే.. ఎవరు ఎంత మెజార్టీతో గెలుస్తారని కూడా బెట్టింగ్స్ నడుస్తున్నాయట. లక్షలు కాదు.. కోట్లలో బెట్టింగ్స్ జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది. ఎవరు అధికారంలోకి రాబోతున్నారు. రాష్ట్రంలో ఎవరిని చూసినా ఇదే చర్చ. ఊరు వాడా, పల్లె పట్నం అని తేడా లేకుండా ప్రతి గల్లిలోనూ ఏ నలుగురు గుమిగూడినా ఇదే చర్చ. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరాం రాష్ట్రాల్లో ఏ పార్టీ, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంచనాలపై వేర్వేరు బెట్టింగ్‌ సంస్థలు పందేలు నిర్వహిస్తున్నాయి. ప్రముఖులు ప్రచారకర్తలుగా ఆయా సంస్థల వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌లకు విస్తృత ప్రచారం కల్పిస్తుండటం, వెబ్‌సైట్లు, బస్టాపులు, ఆటోలపై వారి ప్రకటనలు ప్రదర్శిస్తున్నారు.
గెలిస్తే రెట్టింపు డబ్బులు
బీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ తదితర పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలుస్తాయి.. ఎన్ని సీట్లతో సరిపెట్టుకుంటాయి. అంటూ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ సంస్థలు ప్రకటనలు ప్రదర్శిస్తున్నాయి. డిసెంబరు 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని.. పందెంలో గెలిచిన వారు అంతకంత డబ్బు సంపాదించుకోవచ్చని ఊరిస్తున్నాయి.

ANN TOP 10