AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేటి నుంచి మూడు రోజుల పాటు వైన్స్‌ బంద్‌

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు.ఈ విషయంపై వైన్స్‌, బార్ల యజమానులకు కేంద్ర ఎన్నికల సంఘం ముందస్తు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మద్యం దుకాణాల యజమానులను రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ అప్రమత్తం చేసింది. ఎన్నికలను సజావుగా నిర్వహించే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించకపోతే.. లైసెన్స్‌లు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ANN TOP 10