AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కారులో రూ.2కోట్లు.. హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట్‌లో భారీగా నగదు పట్టివేత

హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్ లో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు. కారులో తరలిస్తున్న రూ.2కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆ నగదు ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.

డబ్బు తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేసి కారులో తరలిస్తున్న రూ.2కోట్ల నగదును పట్టుకున్నారు. అటు నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోనూ భారీగా నగదు పట్టుబడింది. ఓ కారులో కోటి 20లక్షల రూపాయలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

ఎన్నికల వేళ తెలంగాణలో భారీగా నగదు పట్టుబడుతోంది. పోలీసులు, ఎన్నికల అధికారులు జరుపుతున్న తనిఖీల్లో కోట్ల రూపాయల క్యాష్ కనిపిస్తోంది. వాహనాల్లో కట్టలు కట్టల డబ్బును మూటల్లో కట్టి తరలిస్తున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు ఆ డబ్బుని సీజ్ చేస్తున్నారు.

ANN TOP 10