తెలంగాణ బర్రెలక్క గురించి తెలియని వారుండరు. అప్పట్లో బర్రెలతో కనిపించి వైరల్ గా మారిన బర్రెలక్క.. తెలంగాణ బర్రెలక్క శిరీషకు మద్దతుగా యానం మాజీ మంత్రి, ఢిల్లీ ప్రత్యేక అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు లక్ష రూపాయలు విరాళంగా పంపించారు. తెలంగాణ రాష్ట్రం కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభకు తెలంగాణ బర్రెలక్క శిరీష పోటీ చేస్తున్నారు. తెలంగాణలో బర్రెలక్కగా శిరీష ఫేమస్ అయ్యారు.
ఈ తరుణంలోనే.. శిరీషతో ఫోన్లో మాట్లాడిన మల్లాడి కృష్ణారావు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర కొల్లాపూర్ నియోజక వర్గ ఓటరు మహాశయులారా పేద కుటుంబం నుంచి వచ్చిన బర్రెలక్క శిరీషకు ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తున్నాను.









