AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రధాని మోదీతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం..! పలు అంశాలపై చర్చ..!

ఎపి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో గురువారం సాయంత్రం కీలక సమావేశం నిర్వహించారు. ప్రధాని అధికారిక నివాసమైన 7 లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో జరిగిన ఈ భేటీ, రాష్ట్ర అభివృద్ధి, నిధుల సాధన దిశగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం తరఫున అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రధానిని కోరారు. పుష్కరాల ప్రాశస్త్యం, భక్తుల రద్దీని తట్టుకునేలా చేపట్టాల్సిన మౌలిక వసతుల కల్పనపై ప్రధానికి వివరించారు.

నదుల అనుసంధానానికి విజ్ఞప్తిదక్షిణాది ఎదుర్కొంటున్న నీటి ఎద్దడికి పరిష్కారంగా దక్షిణాది నదుల అనుసంధానం ప్రక్రియను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలకు నీటి భద్రత లభిస్తుందని నొక్కిచెప్పారు.

కేంద్ర మంత్రులతో వరుస భేటీలు

ప్రధానితో సమావేశానికి ముందే చంద్రబాబు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై చర్చించి, కేంద్రం నుంచి సంపూర్ణ సహకారాన్ని కోరారు.

ANN TOP 10