AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మిస్ యూనివర్స్ కిరీటం ‘షెన్నిస్ పలాసియో’ సొంతం

ప్రపంచ వ్యాప్తంగా అందాల పోటీల్లో అత్యంత కీలకమైన విశ్వ సుందరి కిరీటం ఈ ఏడాది నికరాగ్వాకు దక్కింది. నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్ ‘మిస్ యూనివర్స్-2023’ టైటిల్‌ను గెలుచుకుంది. మాజీ మిస్ యూనివర్స్ ఆర్‌ బానీ గాబ్రియేల్‌ ఈ కిరీటాన్ని అలంకరించడం ద్వారా ఆమెను అభినందించారు.

కాగా మిస్ యూనివర్స్ 2023 ఎంపిక కోసం పోటీలో పాల్గొన్న అందగత్తెలు వివిధ దశల్లో పోటీపడ్డారు. వ్యక్తిగత ప్రకటనలు, ఇంటర్వ్యూలు, ఈవెనింగ్ గౌన్లు, ఈత దుస్తులలో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ఫైనల్ పోటీకి జెన్నీ మే జెంకిన్స్, మరియా మెనౌనోస్, మాజీ మిస్ యూనివర్స్ ఒలివియా కల్పో హోస్టులుగా వ్యవహరించారు.

ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం కోసం దాదాపు 84 మంది పోటీపడ్డారు. దాదాపు 13000 మంది ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.కాగా మిస్ యూనివర్స్ 2023 ఎంపిక కోసం పోటీలో పాల్గొన్న అందగత్తెలు వివిధ దశల్లో పోటీపడ్డారు. వ్యక్తిగత ప్రకటనలు, ఇంటర్వ్యూలు, ఈవెనింగ్ గౌన్లు, ఈత దుస్తులలో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ఫైనల్ పోటీకి జెన్నీ మే జెంకిన్స్, మరియా మెనౌనోస్, మాజీ మిస్ యూనివర్స్ ఒలివియా కల్పో హోస్టులుగా వ్యవహరించారు. ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం కోసం దాదాపు 84 మంది పోటీపడ్డారు. దాదాపు 13000 మంది ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.

ANN TOP 10