భవిష్యత్ తరాలమేలు కోసమే నా పోరాటం, ఆరాటం
జైనథ్ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటన
ఆరు గ్యారంటీ హామీలపై అవగాహన కల్పిస్తూ జోరుగా ప్రచారం
ఊరురా అపూర్వ స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, గ్రామస్తులు
బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు, చేసిందేమీలేదంటూ ఆరోపణలు
ఆదిలాబాద్: అవినీతిపైనే యుద్ధమని, ఆదిలాబాద్ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే తన పోరాటమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జైనథ్ మండలంలోని నిరాల, బాలాపూర్, ఆకూర్ల, సావాపూర్, లేఖర్‌వాడ, పెండల్‌వాడ, సాంగ్వి, కౌఠ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. బాణాసంచా కాల్చి డప్పుచప్పుళ్ల మధ్య ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీలను వివరిస్తూ ప్రచారంలో దూసుకెళ్లారు.చిన్నాపెద్దా లేకుండా ప్రతిఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకుసాగారు. అందరి ఆశీర్వాదం కోసమే వచ్చానని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు.ముందుగా నిరాల గ్రామానికి వెళ్లిన ఆయన ఎమ్మెల్యే జోగు రామన్నపై విరుచుపడ్డారు.గ్రామంలో ఒక్కరికన్నా ఇల్లు కట్టించాడా అంటూ నిలదీశారు. కొత్త పింఛన్, రేషన్ కార్డులు ఇవ్వని ఆయన మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగానికి వస్తున్నాడని ప్రశ్నించారు. దళితులకు మూడు ఎకరాల భూమి, దళిత బంధు వచ్చిందా…ఇంటి జాగాలు ఇప్పించాడా అంటూ ప్రశ్నించారు. అన్ని అబద్దపు హామీలేనంటూ దుయ్యబట్టారు. కనీసం నకిలీ సోయా విత్తనాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించలేక పోయారని మండిపడ్డారు.అనంతరం పలు గ్రామాలను సందర్శించి బీఆర్ఎస్, బీజేపీలు అవలంభిస్తున్నప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. పనిచేయని ప్రభుత్వాలను, ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న పాలకులను ఇంటికి సాగనంపాలన్నారు. అటు పాయల శంకర్ ఎప్పుడు గెలవడని, జోగు రామన్నను గెలిపించడానికే పోటీ చేస్తాడని ఆరోపించారు.మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. యువతకు
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తన ముందున్న లక్ష్యమన్నారు.ఒక్క అవకాశం ఇవ్వండని, ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ అధికారంలోఆరు గ్యారంటీ హామీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. వృద్ధులకు నాలుగువేల పింఛన్, మహిళలందరికీ నెలకు 2500ల రూపాయలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు.

రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, రైతులకు ఎకరానికి 15 వేలు, రైతు కూలీలకు 12 వేలు, ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల ఆర్థికసాయం అందజేస్తామన్నారు. 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతిఒక్కరూ చెయ్యి గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన మాజీ సర్పంచ్ పండరినాథ్‌కు కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.ప్రచార కార్యక్రమంలో డీసీసీబీ మాజీ అధ్యక్షులు ముడుపు దామోదర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మునిగెల విట్టల్, మాజీ సర్పంచ్ మల్లా రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజన్న, జైనథ్ గ్రామ ఎంపీటీసీ కోడిచెర్ల సుదర్శన్, నాయకులు సంతోష్ చౌదరి, అల్లూరి అశోక్ రెడ్డి, దీపక్ రావు, పెంద్రే దిలీప్, నందు, కేశవ్, కిష్టారెడ్డి, బండి కిష్టన్న, గోలి వెంకటి, చిత్తరి గంగన్న, రాజా లింగన్న, నరోత్తంరెడ్డి, జగదీష్ రెడ్డి, పూదరి ప్రభాకర్, అరిగెల మహేష్, తల్లెల రాకేష్, ప్రమోద్‌రెడ్డి, లస్మన్న, గడ్డం రమేష్ రెడ్డి, దత్తు భోయర్, సూరం నర్సింగ్, పుండ్రు సాయి రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నారాయణ రావు, రఘురామ్, ముత్యాల నిఖిలేష్, సదాలి శివన్న, దగడ్ సాయి, అఫ్రోజ్, హరీష్ రెడ్డి, అశోక్, షేక్ షాహిద్, మహమూద్, ఎలాల్ సంజీవ్ రెడ్డి, రంగినేని కిషన్‌రావు, భారీసంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.









