AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే: చింతామోహన్

తెలంగాణలో ఎన్నికలపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారన్నారు. తెలంగాణలో బీజేపీతో (BJP) కలిసి పోటీ చేస్తూ పవన్ కళ్యాణ్ తప్పు చేశారన్నారు. తెలంగాణలో బీజేపీ, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసినా ఇద్దరికి వచ్చేది 5 సీట్లే అని అన్నారు. తెలంగాణలో ఎన్టీఆర్ పోటీ చేసినా గెలవరన్నారు. ఏపీలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్నారని.. కానీ తమ పార్టీ నేతలే ప్రజలను ఓట్లు అడగడం లేదని మాజీ కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.

చింతామోహన్ ఇంకా మాట్లాడుతూ.. బీజేపీ అధికారం కోసం ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్లు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ అంశం కోర్టు పరిధిలో ఉందని.. కోర్టు నిర్ణయిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో మోడీ (PM Modi) చేసిన ప్రసంగం తనకు నచ్చలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు ఏమీ చేయలేదన్న మోడీ మాటలు బాధించాయన్నారు. కృష్ణా జిల్లా ఎస్సీల వల్ల గాంధీకి సౌత్ ఆఫ్రికాలో గుర్తింపు వచ్చిందని తెలిపారు.

ANN TOP 10