AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌ నాయకులను వేధిస్తే మహిళలే చెప్పుతో కొడతారు: తుమ్మల

‘యథా రాజా తథా ప్రజా’ అన్నట్టు అధికార పార్టీ నేతలు బెదిరించి భూ కబ్జాలు చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 వ డివిజన్ హవేలీలో తుమ్మల రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మలకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ… కార్పొరేటర్లు బరితెగించి దందాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులను బెదిరించే వారిని మహిళలే చెప్పుతో కొడతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ, రాహుల్ గాంధీ రుణం తీర్చుకోవాలని అన్నారు.

దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన గాంధీ కుటుంబం కోసం మద్దతుగా ఉండాలని కోరారు. దేశంలో మత సామరస్యం మంట కలిసేలా కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశంలో విద్వేషం లేకుండా భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ ఐక్యం చేశారని తెలిపారు. మహిళల వికాసం కోసం సోనియా గాంధీ మహాలక్ష్మీ పథకం రూప కల్పన చేశారన్నారు. రైతుల కోసం, కౌలు రైతుల కోసం రైతు భరోసా పథకం కాంగ్రెస్ పాలనలోనే అని చెప్పుకొచ్చారు. ఏ దేశంలో పుట్టినా సోనియా గాంధీ సాటి మహిళల కష్టాలు తెలుసన్నారు. కర్ణాటకలో మాదిరి తెలంగాణలో ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తారని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

ANN TOP 10