AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాత్రి 7 గంటల నుంచి హైదరాబాద్‌లో ‘సదర్’ ట్రాఫిక్ ఆంక్షలు..

సదర్‌‌‌‌ ఉత్సవ మేళాను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలకు సిద్ధమయ్యారు. నారాయణగూడ వైఎంసీఏ మార్గంలో ప్రయాణించే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి బుధవారం వేకువజామున 3 గంటలకు
ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.
ట్రాఫిక్ మళ్లించిన ప్రాంతాలు ఇవే…
1. బర్కత్‌‌పురా చమాన్ నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. బర్కత్‌‌పురా క్రాస్ రోడ్స్, టూరిస్ట్ హోటల్‌‌ నుంచి మళ్లించనున్నారు.
2. కాచిగూడ క్రాస్ రోడ్స్‌‌ నుంచి వైఎంసీఏ రూట్‌‌లో వచ్చే వాహనాలను టూరిస్ట్‌‌ హోటల్‌‌ రోడ్‌‌లో దారి మళ్లింపు.
3. సదర్‌‌‌‌ మేళాకు వచ్చే వాహనాలను శాంతి థియేటర్‌‌‌‌, రెడ్డి కాలేజ్‌‌, మెల్కొటే పార్క్‌‌, దీపక్ థియేటర్‌‌‌‌ పార్కింగ్‌‌ ఏరియాల్లో పార్క్‌‌ చేయాల్సి ఉంటుంది.
4. స్ట్రీట్ నంబర్‌‌‌‌ 8 నుంచి వైఎంసీఏ వైపు ప్రవేశం లేదు. రెడ్డి కాలేజ్‌‌ వద్ద బర్కత్‌‌పురా వైపు మళ్లీస్తారు.
5. బ్రిలియంట్ గ్రామర్ స్కూల్‌‌ నుంచి రెడ్డి కాలేజి వైపు వచ్చే వాహనాలకు ఎంట్రీ లేదు. నారాయణగూడ క్రాస్ రోడ్స్‌‌ మీదుగా మళ్లించనున్నారు.
6. ఓల్డ్‌‌ ఎక్సైజ్ ఆఫీస్‌‌ నుంచి వచ్చే వాహనాలను విఠల్‌‌వాడి మీదుగా మళ్లిస్తారు.
7. సికింద్రాబాద్‌‌ నుంచి కోఠి వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను నారాయణగూడ క్రాస్‌‌ రోడ్స్, బర్కత్‌‌పురా, బాగ్‌‌లింగంపల్లి, వీఎస్‌‌టీ, ఆర్టీసీ రోడ్స్‌‌ మీదుగా మళ్లించనున్నారు.

ANN TOP 10