హైదరాబాద్‌లోని నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. బజార్‌ఘాట్‌లోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఉన్న స్టోరేజీ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంట్లలో చిక్కుకున్న చిన్నారి, మహిళను రెస్యూ టీమ్ ధైర్యంగా రక్షించారు. ప్రాణాలకు తెగించి ఇద్దరిని కాపాడారు. బజార్ ఘాట్ లో హిమాలయ హోటల్ ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో కెమికల్ గోదాం ఉంది. అపార్ట్ మెంట్ వాసులు, పలువురు కార్మికులు మంటల్లో చిక్కున్నారు. కెమికల్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, మూడు ఫైర్ ఇంజన్స్ తో మంటలు ఆర్పివేశారు.
మొదట కెమికల్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగిందని ఆ తర్వాత అపార్ట్ మెంట్ లోకి మంటలు వ్యాపించాయని డీసీపీ పేర్కొన్నారు. జీ+4 బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో డీజల్ డ్రమ్ముల్లో మంటలు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కార్ రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయని వెల్లడించారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మృతి చెందగా, మరో ముగ్గురుకి గాయాలు అయ్యాయని పేర్కొన్నారు.









