– మృతుల్లో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు
హైదరాబాద్ నాంపల్లి బజార్‌ఘాట్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందడం అందరినీ కలిచివేసింది. నాలుగు అంతస్తుల భవనంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లోని గ్యారేజ్‌లో అగ్నిప్రమాదం సంభవించగా.. పెద్ద ఎత్తున మంటలు పైవరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు ఓకే కుటుంబానికి చెందిన వారు కావడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన బీడీఎస్ డాక్టర్ తహూరా ఫర్హీన్ సెలవులు కావడంతో తన ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఉదయం జరిగిన ప్రమాదంలో తన ఇద్దరు చిన్నారులతో సహా ఫర్ఫీన్ ప్రాణాలు కోల్పోయింది.
మృతుల వివరాలు…
భార్యాభర్తలు మహ్మద్ ఆజమ్ (54), రెహ్మాన్ సుల్తానా (50), వీరి కుమార్తెలు హసీబ్ ఉర్ రెహమాన్ (32), ఫైజా సమీన్ (26), కుమారుడు తహూరా ఫర్హీన్(35), మనవరాళ్లు తూబా(6), తరూబా(13) మృతి చెందారు. అలాగే మరో దంపతులు ఎండీ జాకీర్ హుస్సేన్ (66), నిక్కత్ సుల్తాన్ (55) ప్రాణాలు కోల్పోయారు.









