తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షం పడడంతో రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు నెమ్మదిగా వెళ్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లక్డీకాపూల్, మోహదీపట్నం, జూబ్లీచెక్ పోస్ట్, యూసుఫ్‌గూడ, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అబిడ్స్, కోఠి, ఎల్బీనగర్, మియాపూర్, సింద్రాబాద్, దోమలగూడ, హిమాయత్ నగర్, అశోక్ నగర్, చిక్కడపల్లి, నారాయణగూడతోపాటు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.









