సూసైడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ (Telangana State) మారిందని ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ పవన్ ఖేరా వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. 9 ఎండ్లు తమని మోసం చేసిన కేసీఆర్‌కు (CM KCR) బుద్ది చెప్పాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందని.. పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేకపోయారని విమర్శించారు.
తెలంగాణ యువకుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన అన్ని హామీలను కేసీఆర్ విస్మరించారన్నారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల విద్యార్థులు సూసైడ్ చేసుకుంటే ఆమె క్యారెక్టర్‌పై బురద జల్లే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై కోపంగా లేని ఒక్కరినైనా చూపెట్టగలరా అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ ప్రజల సమస్యలన్నింటికి పరిష్కారం నవంబర్ 30న ఇచ్చే తీర్పే.. మీ కోపాన్ని నవంబర్ 30న చూపెట్టండి’’ అంటూ పవన్ ఖేరా పేర్కొన్నారు.









