కాంగ్రెస్ మూడో జాబితా రిలీజ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రంజుగా మారాయి. ప్రధాన పార్టీల మధ్య పోరు అభ్యర్ధుల ఎంపికతో మరింత రసవత్తరంగా మారింది. జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్దులను ఖరారు చేసి మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం నుంచి ఆల్రెడీ పోటీ చేస్తున్నప్పటికి కామారెడ్డిలో బరిలోకి దింపుతోంది కాంగ్రెస్.
ఇక్కడి నుంచి ఈసారి కేసీఆర్ పోటీ చేస్తుండటంతో..ఎలాగైనా ఆయన్ని ఓడించాలనే పట్టుదలతో రేవంత్‌రెడ్డికి రెండు చోట్ల టికెట్‌లు ఇచ్చి మరీ బీఆర్ఎస్ దూకుడుకి కళ్లెం వేయాలని చూస్తోంది కాంగ్రెస్. రేవంత్‌రెడ్డితో పాటు మరో 15మంది అభ్యర్ధులను ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం 16మంది పేర్లతో మూడో జాబితాను విడుదల చేసింది.
ప్రకటనలు
మూడో జాబితాలో 16 మంది అభ్యర్ధులు వీరే..
తెలంగాణలో జరిగే 119 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ పూర్తి స్థాయిలో అభ్యర్ధుల్ని ప్రకటించింది. గతంలో 2జాబితాలలో 103మంది అభ్యర్ధుల్ని ప్రకటించిన హస్తం పార్టీ పెద్దలు తాజాగా మరో 16మంది పేర్లతో మూడో జాబితాను సోమవారం విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని మరో స్థానం నుంచి బరిలోకి దింపుతోంది. కేసీఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ కామారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్ధికి ప్రత్యర్ధిగా రేవంత్‌రెడ్డిని పోటీలో నిలబెడుతూ పేరును ప్రకటించింది.
చెన్నూరు- వివేవ్ వెంకటస్వామి
బోథ్-గజేందర్
జుక్కల్-తోట లక్ష్మీకాంతరావు
బాన్సువాడ-ఏనుగు రవీందర్‌రెడ్డి
నిజామాబాద్(అర్బన్)-మహ్మద్ షబ్బీర్ అలీ
కరీంనగర్ -పురుమళ్ల శ్రీనివాస్
సిరిసిల్ల-కొండం కరుణా మహేందర్‌రెడ్డి
నారాయణణఖేడ్-సురేష్ కుమార్ షెట్కర్
పటాన్‌చెరు-నీలం మధు ముదిరాజ్
వనపర్తి -తుడి మెగారెడ్డి
డోర్నకల్-రామచంద్రునాయక్
ఇల్లందు-కోరం కనకయ్య
వైరా-రాందాస్ మాలోత్
సత్తుపల్లి-మట్టా రంగమాయి
అశ్వాపురం-జారె ఆదినారాయణ









