AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హీరోలందరూ లైన్‌ వెయ్యడానికే.. అనుసూయ హాట్‌కామెంట్స్‌

యాంకర్‌ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తోంది. తెలుగు యాంకరింగ్‌లో గ్లామర్‌ను అద్దిన అతికొద్ది మందిలో ఈ భామ కూడా ఒకరు. అది అలా ఉంటే ఈ భామ తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె మాట్లాడుతూ.. అత్తారింటికి దారేది సినిమాలో ఒక పాటలో అవకాశం వచ్చింది. అయితే అందులో చాలా మంది హీరోయిన్స్‌ ఉన్నారని నేను చేయనని చెప్పా అని పేర్కొన్నారు. గుంపులో ఒకరిగా నటించడం నాకు నచ్చలేదని తెలిపారు.


ఇంకా ఆమె మాట్లాడుతూ.. షూటింగ్స్‌లో నా పని నేను చూసుకుని వెళ్తుంటాను. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు చాలా దూరంగా ఉంటాను. ఈ కారణంగా చాలా హీరోయిన్‌ అవకాశాలను కూడా కోల్పోయానని తెలిపారు. అలా పార్టీలకు వెళ్తేనే అవకాశాలు వస్తాయంటే.. దాన్ని నేను ఎంకరేజ్‌ చేయనని తెలిపింది. నేను 2013లో దేవి శ్రీ ప్రసాద్‌తో యుఎస్‌ టూర్‌ చేసాను. ఆ టైమ్‌ లో అడివి శేష్‌ నన్ను అప్రోచ్‌ అయ్యాడు. హీరోలందరూ లైన్‌ వెయ్యడానికి అప్రోచ్‌ అవుతారు అనుకుని నేను అవైడ్‌ చేసేదాన్ని.. అంటూ తెలిపారు. అయితే నిజానికీ అడివి శేష్‌ తనతో క్షణం అనే సినిమా కోసం వచ్చాడట.

ANN TOP 10