AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎన్నికల్లో పోటీ చేయను.. డీకే అరుణ కీలక నిర్ణయం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. తన స్థానంలో గద్వాల (Gadwal)లో బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తామని తెలిపారు డీకే అరుణ. బీసీ సీఎం నినాదంతో తెలంగాణ ఎన్నికలకు వెళ్తోంది. తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని సూర్యాపేట సభ వేదికగా అమిత్ షా ప్రకటించారు. అంతేకాదు మెజారిటీ సీట్లు కూడా బీసీలకే కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే డీకే అరుణ కూడా..తన సీటును బీసీలకు త్యాగం చేసినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.

కేసీఆర్ దోచుకున్న సొమ్మును లాక్కుంటాం..ప్రజలకు పంచుతాం..
కాగా, తెలంగాణ బీజేపీ ఇప్పటి వరకు 53 మందికి టికెట్లు ఇచ్చారు. 52 మందితో తొలి జాబితాను విడుదల చేయగా.. రెండో జాబితాలో ఒక్కరికే టికెట్ కేటాయించారు. కిషన్ రెడ్డి మినహా మిగిలిన ముగ్గురు ఎంపీలను బరిలోకి దింపింది బీజేపీ. కరీంనగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, కోరుట్ల నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్, బోథ్ నుంచి ఎంపీ సోయం బాపూరావు పోటీ చేస్తున్నారు. రాజాసింగ్ మళ్లీ గోషామహల్ నుంచే పోటీలో ఉన్నారు. ఇప్పటి వరకు 12 మంది మహిళలకు అవకాశం ఇచ్చింది బీజేపీ. బీసీలు-16, ఎస్సీలు-8, ఎస్టీలు-6, ఓసీలు-10 మందికి స్థానాలు కేటాయించింది.

ANN TOP 10