AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేటి నుంచి కేసీఆర్‌ రాజశ్యామల మహాయాగం

సీఎం ఫాంహౌస్‌లో మూడు రోజుల పాటు యాగం

కేసీఆర్‌కు ఆధ్యాత్మిక భావాలు సెంటిమెంట్లు ఎక్కువ. ఆయనలో దైవ చింతన భక్తి ప్రపత్తులు కూడా ఎక్కువే. ఆయన గతంలో తెలంగాణా సాధన కోసం యాగాలు చేశారని ప్రచారంలో ఉంది. ఇక రెండవ మారు అధికారంలోకి రావడం కోసం 2018లో కేసీఆర్ స్వయంగా రాజశ్యామల యాగం చేశారు. దాని ఫలితంగా ఆయన రెండవసారి దిగ్విజయంగా సీఎం అయ్యారని అంటారు.

ఇపుడు ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం కావాలని అనుకుంటున్నారు. దాని కోసం ఎన్నికల క్షేత్రంలో యుద్ధం మొదలెట్టేశారు. మరోవైపు తనకు కలసి వచ్చిన రాజశ్యామల యాగాన్ని ఆయన చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ యాగానికి నవంబర్ 1 నుంచి మూడు రోజుల నిర్వహించనున్నారు. యాగశాలను సిద్దిపేటలోని ఎర్రపల్లిలో కేసీఆర్ కి చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేశారు. ఇందు కోసం 251 మంది రుత్వికులు పొల్గొంటున్నారు.

ANN TOP 10