మంత్రి గంగుల కమలాకర్ కు ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. కరీంనగర్ నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రచార రథంపై ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒకరు చెప్పుతో దాడి చేశాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాకర్‌కు చెందిన ఎల్‌ఈడీ వాహనం నగరంలోని గోపాల్‌పూర్‌లో తిరుగుతోంది. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు జగదేశ్వరాచారి ఆ వాహనాన్ని చెప్పుతో కొట్టాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.









