నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మీ దీవెనలు ఇవ్వాలని పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పది సంవత్సరాలు తుపాకీ రాముడు కథలు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష కోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఐదు లక్షల కోట్లు అప్పు చేసాశారన్నారు. తెలంగాణా రాష్ట్రంతో గాంధీ కుటుంబానికి అను బంధం ఉందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో డబ్బుల సంచులతో వస్తారని.. ఎంత అడిగితే అంత ఇస్తారన్నారు. టాక్స్‌లు కట్టిన డబ్బులు కొల్లగొట్టి ప్రజల దగ్గరకే తీసుకు వస్తున్నారని మండిపడ్డారు. యాదవులు గొర్రెల కోసం డీడీలు కడితే ఇంత వరకు ఇవ్వకపోవడంతోనే ఇక్కడి ఎమ్మెల్యే పనితీరు కనిపిస్తుందన్నారు. అబద్దాలు చెప్పేటప్పుడు తడుముకోకుండా చెప్పడంలో కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఇద్దరు ఒక్కటే అంటూ వ్యాఖ్యలు చేశారు. సొల్లు మాటలు చెప్పే కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కే ప్రజలు పరిమితం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుందన్నారు. నిరుద్యోగుల ఆశలు అడిఆశలు చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విరుచుకుపడ్డారు.









