AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడి.. గవర్నర్ ఆగ్రహం

బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపైన జరిగిన దాడిని గవర్నర్ తమిళసై ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరమన్నారు. ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు, ప్రచారకుల భద్రతను పరిశోధించడానికి, నిర్ధారించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను గవర్నర్ ఆదేశించారు. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల కోసం శాంతియుత సురక్షితమైన వాతావరణాన్ని నిర్వహించాలని సూచించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని తమిళిసై ఆశించారు.

ANN TOP 10