విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి రైల్వేజంక్షన్ దగ్గర రెండు రైళ్లు ఢీ కొన్నాయి. రాయగడ ప్యాసింజర్ ను వెనుక నుంచి పలాస ప్యాసింజర్ ఢీకొంది. సిగ్నల్ కోసం ఆగిన ప్యాసింజర్‌ను పలాస ప్యాసింజర్ ఢీకొంది. పట్టాలు తప్పిన విశాఖ- రాయగడ ప్యాసింజర్ మూడు బోగీలు చెల్లాచెదురయ్యాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వే సిబ్బంది తెలిపింది. పట్టాలు క్రాస్ చేస్తుండగా ఒక ట్రైన్‌ను మరో రైలు ఢీకొంది.
విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆలస్యం అయింది. కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా కలెక్టర్, ఎస్సీని సంఘటన స్థలానికి హుటాహుటిన పంపించింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.









