AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నన్ను కొనేటోడు ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదు

నన్ను కొనేటోడు ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం నాడు కాంగ్రెస్ విజయభేరీ బస్సు యాత్ర మెదక్‌ పట్టణంలోని రాందాస్ చౌరస్తాకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, రేవంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…‘‘స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని నిలదీయడానికి మల్కాజిగిరి ప్రజలు నన్ను ఎంపీగా గెలిపించారు. మైనంపల్లి రోహిత్‌ను చూస్తోంటే ఇరవై ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టుంది. రాబోయే ముప్పై ఏళ్లు రోహిత్ పేద ప్రజలకు సేవ చేస్తారు. పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడికి పోయాయో తెలియదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలను అమలు చేయలేదు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి. అందుకే తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. కేసీఆర్ నువ్వో కచరా..నన్ను రేటెంతరెడ్డి అంటావా’’ అని రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ANN TOP 10