AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్‌ను ఓడగొట్టే మొగోడు రేవంత్‌ రెడ్డే

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జగిత్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్‌ను ఓడగొట్టే మొగోడు రేవంత్‌ రెడ్డేనని అన్నారు. కేసీఆర్‌ తిన్న సొమ్ము అంతా కక్కిస్తామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ కటాకటాల్లోకే అని అన్నారు. చైనా లాంటి దేశాల్లో ప్రాజెక్టులు కుంగితే ఉరి తీసేవారని చెప్పుకొచ్చారు. ఈఎన్సీ మురళీధర్‌ రావుకు సర్టిఫికెట్‌ ఎవడు ఇచ్చారో తెలియదన్నారు. మురళీధర్‌ రావుకు కనీస జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. దొర సంతకం పెట్టమనగానే పెడతావా.. మురళీధర్‌ రావు ను జైల్లో వేయాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేస్తే.. కాంగ్రెస్‌ మొదట గెలిచే సీటు అదే అని.. కేసీఆర్‌ను ఓడగొట్టే మొగోడు రేవంత్‌ రెడ్డే అని జీవన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

ANN TOP 10