తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. ప్రజాఆశీర్వాద సభల పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో గులాబీ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అచ్చంపేట బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఇంతకాలం తాను పోరాటం చేశానని ..ఇకపై పోరాటం చేయాల్సింది ప్రజలేనని చెప్పారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఎవరో వచ్చి చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని..నమ్మి ఓటేస్తే పోరాడి సాధించుకున్న తెలంగాణను కుక్కలు చింపిన విస్తరి చేస్తారని చెప్పారు.
నా దమ్ము ఏంటో తెలియాలంటే కొడంగల్ వచ్చి పోటీ చేయమని చెబుతాడో నేత..నా దమ్మేంటో తెలియదా..అలాంటి వాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. నాడు తెలంగాణకు అడ్డుపడిన పార్టీలే ఇప్పుడు అది ఇస్తాం..ఇది చేస్తామని ప్రజలకు మాయమాటలు చెబుతున్నారని కాంగ్రెస్, బీజేపీ నాయకులను తిట్టిపోశారు. కేసీఆర్ శవయాత్రనా, తెలంగాణ విజయయాత్రనా అన్నట్లుగా ప్రాణాల్ని పణంగా పెట్టి సాధించిన రాష్ట్రాన్ని ఎవడో చేతిలో పెడితే మళ్లీ బాధలు తప్పవని అందరూ ఓటేసే ముందు ఆలోచించి ఓటేయాలని అచ్చంపేట సభలో ఓటర్లకు సూచించారు కేసీఆర్.









