AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భారీగా నగదు సీజ్

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమలులోకి వచ్చిన దగ్గర నుండి పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి గురువారం వరకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా రూ.347.16కోట్లకుపైగా సొత్తును పోలీసులు సీజ్‌ చేశారు. గత 24గంటల్లో రూ.6.85కోట్ల నగదు, ఆభరణాలు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్‌ 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు రూ.122.62కోట్ల నగదును సీజ్‌ చేశారు. అలాగే రూ.156.22 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు పట్టుకున్నారు. రూ.20.70కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీల్లో రూ.17.18కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుకున్నారు. అలాగే, ఓటర్ల కోసం పంపిణీకి సిద్ధం చేసిన రూ.30.42కోట్ల విలువైన కానుకలను సీజ్‌ చేసినట్లు అధికారులు వివరించారు.

ANN TOP 10