సినీనటి హనీ రోజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర లేని పేరు. ఈ భామ ఆ మధ్య నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’లో కీలక పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా భారీగా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాలో సీనియర్ బాలయ్య సరసన నటించిన హనీరోజ్‌కు మంచి పాపులారిటీ దక్కింది. అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని ఫొటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.









